TRINETHRAM NEWS

Trinethram News : కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్, శుక్రవారం విశాఖ సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఎస్సీ సంఘాల నాయకులు అతనికి స్వాగతం పలికారు. కాగా, శ్రీనివాసు గురువారం షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై దాడి కేసులో శ్రీనివాస్ ను పోలీసుల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..