TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం : కోడికత్తి కేసు (Kodikathi Case) విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో ఎన్‌ఐఏ ఇంచార్జ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి..

ఈ కేసులో బెయిల్ తర్వాత తొలిసారిగా కోడికత్తి శ్రీను (Kodikathi Srinu) కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 19కి ఏన్‌ఐఏ ఇంచార్జ్ కోర్టు వాయిదా వేసింది..

వాయిదా అనంతరం లాయర్ సలీమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో జగన్ తన వాంగ్మూలం ఇవ్వాలన్నారు. ఈ కేసులో లోతైన విచారణ జరగాలంటూ సీఎం జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై పోరాడాతామని తెలిపారు. ఎన్నికలకు ముందే ఈ కేసు క్లోజ్ అయ్యేలా ప్రయత్నం చేస్తామన్నారు. సీఎం వాంగ్మూలం ఇస్తే ఈ కేసు 90% క్లోజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో నీళ్లు ఏవో పాలు ఏవో తేలుస్తామని లాయర్ సలీమ్ పేర్కొన్నారు..

ప్రతిసారి ఓదో ఒక సాకు చెబుతూ…: బూసి వెంకటరావు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక వాదం చెప్పి కోర్టుకు హాజరుకావడం లేదని దళిత ఐక్యవేదిక బూసి వెంకటరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి అత్యున్నత విచారణ సంస్థ ఎన్‌ఐఏ కూడా కుట్ర కోణం లేదని చెప్పిందన్నారు. ఇంకా ఎందుకు వాదనలు కొనసాగిస్తుందో అర్థం కావడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం చేస్తున్నారేమో అని అనుమానంగా ఉందన్నారు. ఈ కేసు నుంచి ఎన్ఐఏ దర్యాప్తు పూర్తయింది కాబట్టి వైదొలగాలని కోరుతున్నామని బూసి వెంకటరావు అన్నారు..