
హైదరాబాద్: ‘రాజావారు రాణిగారు’ సినిమాలో నటించిన కిరణ్ అబ్బవరం , రహస్య గోరక్ జోడీ నిజ జీవితంలో ఒక్కటి కాబోతోంది. వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో బుధవారం జరిగింది. సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు ఈ హీరో- హీరోయిన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి ఆగస్టులో ఉంటుందని సినీ వర్గాల సమాచారం.
‘రాజావారు రాణిగారు’తోనే కిరణ్ తెరంగేట్రం చేశారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారిందని గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఓ సందర్భంలో కిరణ్ స్పందిస్తూ.. రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని చెప్పారు. ఇప్పుడిలా సర్ప్రైజ్ ఇచ్చారు. తర్వాత, ‘ఎస్ఆర్ కల్యాణమండపం’, ‘సెబాస్టియన్’, ‘సమ్మతమే’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ చిత్రాలతో కిరణ్ సందడి చేయగా, రహస్య తమిళ చిత్రం ‘షర్బత్’లో నటించారు…..
