Khandistu Rastarokho strongly condemns the attack on MLA Kaushik Reddy
కోరుకంటి చందర్ మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుల అధ్వర్యంలో గోదావరి బ్రిడ్జి పైన బిఆర్ఎస్ శ్రేణులు రాస్తా రోకో నిర్విహించారు.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కోరుకంటి చందర్ మాట్లాడుతు అరికపూడి గాంధీ అనుచరులను వెంట వేసుకొని తోటి ఒక శాసనసభ్యుడిపై దాడి చేయడం హేయమైన చర్య. నేను కాంగ్రెస్ లో చేరలేదు ఇంకా బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్న అన్న అరికపూడి గాంధీ మాటలకు… కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా రేపు ఉదయం అరికపూడి ఇంటికి వెళ్లి ఇంటిపై బిఆర్ఎస్ జెండా ఎగురవేసి అతనికి పార్టీ కండువా కప్పి కేసీఆర్ దగ్గరికి తీసుకెళుతా అన్నారు.
రాజకీయాల్లో దానికి మీ అభిప్రాయం చెప్పాలి కానీ సమాధానం చెప్పకుండా కౌశిక్ రెడ్డి పై వాడరాని భాష మాట్లాడుతూ ఇంటిపై దాడికి రావడం సిగ్గు చేటు కౌశిక్ రెడ్డి ని పోలీసులతో ఇంటిలోనే నిర్బంధించిన ప్రభుత్వం, అరికపూడి గాంధీని మాత్రం వందలాది అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వెళ్ళి దాడి చేసేలా ఉసిగొల్పింది.అరికపూడి గాంధీని,వందలాది అనుచరులను కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరే వరకు ఎందుకు అపలేకపోయారు.అతను ఎలా రాగలిగాడు.ఎవరి కనుసన్నల్లో ఇదంతా నడుస్తుందో ప్రజలందరికీ తెలుసన్నారు.
పక్క ప్లాన్ ప్రకరామే ఈ దాడి జరిగింది.దాడి చేయడానికి కాకపోతే ముందుగానే టమాటాలు,గుడ్లు రాళ్లు ఎలా తెచ్చుకుంటారు. శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు.ఒక శాసన సభ్యుడిపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. దాడికి పాల్పడిన వారందరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి.
తెలంగాణలో ఇదివరకు లేని దాడుల సంస్కృతిని ఆజ్యం పోసి కాంగ్రెస్ తెలంగాణ లో రౌడీ రాజ్యం తేవాలనుకుంటుందా అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరకపోతే ఇంటిపై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడానికి,మెడలో కండువా వేసుకోవడానికి ఉన్న అడ్డు ఏమిటి ? బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రేస్ లో చేరిన అరికపూడి గాంధీ, చేరిన మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలో పోటీ చేయాలి.
లేకుంటే రాబోయే రోజుల్లో న్యాయస్థానంలో, ప్రజాకోర్టులో మీకు శిక్ష తప్పదు.అని హెచ్చరించారు. బిఆర్ఎస్ మ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తున్నా కూడ చూస్తు నివారించక పోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనం .ఇది ప్రజా పాలన కాదు పోలీస్ గుండా పాలన సాగుతుంది.
నిరసనలు కూడ తెలుపకుండా అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు..అరెస్ట్ అయిన వారిలో కోరుకంటి చందర్ తో పాటు పెంట రాజేష్.బొడ్డు రవీందర్.నూతి తిరుపతి.జక్కుల తిరుపతి.కార్పోరేటర్స్ కృష్ణవేణి.గాదం విజయ.గుంపుల లక్ష్మి.సంద్యారెడ్డి.స్వప్న.తిరుమల.లింగాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్.ప్రశాంత్.శ్రావణ్.బొబ్బిలి సతీష్.లు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App