TRINETHRAM NEWS

ఢిల్లీలో కాంగ్రెస్‌కు సీట్లిచ్చేందుకు కేజ్రీవాల్ నో

Trinethram News : Delhi : మూడు నెలల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగాపోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయకూడదని నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు కానీ.. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితి అనుకూలంగానే ఉంది. కానీ హర్యానాలో గెలిచి తీరుతామన్న నమ్మకంతో అక్కడ ఆప్ ను కలుపుకోలేదు.

హర్యానాలో తమను కలుపుకోని కాంగ్రెస్ ను.. ఢిల్లీలో ఎందుకు కలుపుకోవాలన్న అభిప్రాయానికి కేజ్రీవాల్ వచ్చారు. అందుకే ఢిల్లీలో ఒంటరి పోరేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అక్కడ ఆ పార్టీకి పునాదులు కదిలిపోయాయి. కనీసం ఖాతా తెరవడం కష్టంగా మారుతోంది. గత గత రెండు ఎన్నికల్లో ఆప్.. అంతకు ముందు రెండు ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేశాయి.

ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చాలా మంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. నాయకుల కొరత కూడా ఉంది. ఇప్పుడు ఆప్ తో పొత్తు పెట్టుకుందామని చేసే ప్రయత్నాలు కూడా విఫలం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల నష్టమే ఎక్కువ జరుగుతోందని కేజ్రీవాల్ నమ్ముతున్నారు. అందుకే మొహమాటం లేకుండా పొత్తు లేదని ప్రకటించేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App