TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్

BRS Chief: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్‌ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరుతో బీఆర్‌ఎస్‌ బహిరంగసభ నిర్వహిస్తుంది..

కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర సర్కార్ కు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా కేసీఆర్ ఎండగట్టాలని చూస్తున్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం నిన్న (ఫిబ్రవరి 12) అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్‌ ఎలా స్పందించనున్నారు అనేది చూడాలి. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభా వేదికగా గులాబీ దళపతి అల్టిమేటం జారీ చేసే ఛాన్స్ ఉంది..