టీడీపీ అధినేత చంద్రబాబు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై నిన్న ఇంకొల్లు సభలో తీవ్ర విమర్శలు చేశారు. కరణం బలరాం ఒక దుర్మార్గుడు అని ఇంకొల్లు సభలో బాబు నిప్పులు చెరిగారు.
తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలకు కరణం బలరాం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నన్ను దుర్మార్గుడిగా అభివర్ణించారు..
ఇంకొల్లు సభలో నాపై అవాకులు, చెవాకులు పేలారు.. కానీ చంద్రబాబు లాంటి నమ్మించి మోసం చేసే దుర్మార్గుడిని నేనింత వరకు చూడలేదని కౌంటర్ ఇచ్చారు.
మీ చరిత్ర ఏందో.. నా చరిత్ర తేల్చుకుందాం రా.. అని సవాల్ విసిరారు.
మీరు అయిన రండి.. లేదా మీ ఆఫీస్‌కు నన్ను రమ్మన్నా వస్తానని చాలెంజ్ చేశారు. 2019లో టీడీపీ తరుఫున చీరాల నుండి పోటీ చేస్తానని తాను అడగలేదని స్పష్టం చేశారు.
మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారనీ.. నన్ను చీరాలకు పంపించారు.. అయినప్పటికీ నా సత్తాతో చీరాలో గెలిచానని చెప్పారు.
పార్టీలకతీతంగా చీరాల ప్రజలు నన్ను గెలిపించారని తెలిపారు. చీరాలలో నన్ను గెలిపించే సత్తా చంద్రబాబుకు ఉంటే.. మంగళగిరిలో స్వయంగా ఆయన కొడుకు లోకేష్ మంగళగిరిలో ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించారు