ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి!
Trinethram News : ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో ప్రజలకు పంపిణీ చేయాల్సిన బ్యాంల్లు (కందిపప్పు) ప్రజలకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టినట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం… ప్రజల ద్వారా బయోమెట్రిక్ లో కందిపప్పు ఇచ్చినట్లు వేయించుకొని ఇవ్వడం లేదని గ్రామస్తులు తెలిపారు…. గ్రామంలో సుమారు 900 వైట్ రేషన్ కార్డులు ఉండగా సుమారు 700 రేషన్ కార్డులక కందిపప్పు అలాట్మెంట్ చేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు… గ్రామానికి వచ్చినటువంటి కందిపప్పు ప్రజలకు పంపిణీ చేయకుండా ఎక్కడికి వెళ్లినట్లు?… సంబంధిత అధికారి పర్యవేక్షణ జరుగుతుందా?… గతంలో కూడా ఇలాగే చాలాసార్లు జరిగిందని పలువురు గ్రామస్తులు తెలుపుతున్నారు…. ఇది ఇలా ఉండగా.. పర్యవేక్షణ చేయాల్సిన సంబంధిత మండల ఉన్నతాధికారి… గ్రామాలలో ఎందుకు పర్యవేక్షణ చేయడం లేదు?…. ఈ అధికారిపై గతంలో వారి ఇంట్లో ఓ వేడుక జరిగితే మండలంలోని ప్రతి డీలర్ దగ్గర కొంత నగదును గిఫ్ట్ గా అందుకున్నట్లు కొంతమంది డీలర్లు ఆరోపించారు…. ప్రస్తుతం ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ఎలాంటి అవినీతి జరగకుండా కనీసం బియ్యం వేసే సమయంలో డబ్బా …బ్యాగ్ వినియోగించకుండా ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడితే కొంతమంది అధికారులు కొంతమంది డీలర్లు ఆ విషయాన్ని నీరుగారిస్తున్నారని…కొన్ని గ్రామాలలో ఇదే కొనసాగుతుందని కొద్ది రోజుల క్రితం బిజెపి సంబంధించిన పలువురు నాయకులు ఎవిడెన్స్ తో సహా నిరూపించారు… అయినా కొంతమంది డీలర్లు మారడం లేదని…అలాంటి వారిపై జిల్లా అధికారులు చరలు చేపట్టాలని … ప్రజలకు ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా అందించాల్సిన ప్రతి వస్తువు కూడా ప్రభుత్వ ప్రజలకు నేరుగా అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరారు…