
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఈసీ హాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు జ్యోతిరావు పూలే చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసారని తెలిపారు.
వ్యక్తిగత జీవితాలను సమాజం కోసం త్యాగం చేసి నలుగురికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేసిన ప్రతి ఒక్కరూ మహనీయులుగా కీర్తించబడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్ ఉదయభాస్కర్, పి విజయనిర్మల, పి వెంకటేశ్వరరావు, కె సుబ్బారావు మరియు విశ్వవిద్యాలయ అధికారులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
