
Trinethram News : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున నోట్లకట్టలు బయటపడిన వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపాలని అధికారికంగా సిఫారసు చేసింది.
ఈ మేరకు సీజేఐ సంజయ్ ఖన్నా, న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్య కాంత్, ఓసీ ఓకాతో కూడిన కొలీజియం అధికారిక ప్రకటన జారీ చేసింది. ”మార్చి 20, 24 తేదీల్లో సమావేశమైన కొలీజియం హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టు జ్యురిస్‌డిక్షన్‌ను పంపాలని సిఫారసు చేస్తోంది” అని ఆ అధికారిక ప్రకటన పేర్కొంది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
