ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 12 25 at 17.40.16

TRINETHRAM NEWS

జాలి, దయ, క్షమాగుణం మానవాళీకి బోధించిన మహనీయులు ఏసుక్రీస్తు

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాలి, దయ, క్షమాగుణం మానవాళీకి బోధించిన మహనీయులు ఏసుక్రీస్తు
అని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. క్రీస్మస్ సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని కల్వరి చర్చి, గౌతమినగర్ గ్లోరియస్ చర్చి లో ప్రార్దనలో మజీ ఎమ్మెల్యే చందర్ పాల్గొన్నారు. కైస్తవులకు క్రీస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈ క్రిస్మస్ మనందరికీ శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సహనాన్ని, క్షమాగుణాన్ని నేర్పుతుందన్నారు.
ఎదుటివారి పట్ల జాలి, దయ, క్షమాగుణం కలిగి ఉండాలని ఏసుక్రీస్తు ప్రబోధించారన్నారు.
తోటివారిని ప్రేమించండి, తోటి వారికి ఉపకారం చేయండి, పది మందికి సహాయం చేసినపుడే నీ జన్మ ధన్యమవుతుందని ప్రభువు చెప్పారన్నారు. తనను శిలువ వేసిన వారిని, తనను నానా మాటలు అన్నవారిని కూడా క్షమించండి అన్న గొప్ప దయామయుడు ఏసు క్రీస్తు అన్నారు. దేశంలో క్రిస్టమస్ పండుగను రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారన్నారు. క్రిస్మస్ తెల్లవారి బాక్సింగ్ డే రోజు కూడా సెలవుగా ప్రకటించింది కేసీఆర్ అన్నారు. బతుకమ్మ పండుగకు హిందువులు, రంజాన్ పండుగకు ముస్లింలు, క్రిస్మస్ పండుగకు క్రైస్తవులు కొత్త బట్టలను కేసీఆర్ గారు పదేళ్లపాటు అందించారన్నారు. క్రిస్మస్ పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని, మీ కోరికలు, కలలన్నీ నిజం కావాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఏసుప్రభువు చెప్పిన విషయాలన్నింటినీ మనం జీవితంలో ఆచరించాలన్నారు. ఈ కార్యక్రమం లో జిమ్మిబాబు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page