వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 08 మార్చ్ 2025
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి ఒయాసిస్ విద్యాసంస్థల ట్రెజరర్ జన్ను అరుణ పరంజ్యోతి మహిళలు అన్ని రంగాల్లో రాణించి సమాజంలో మార్పు తీసుకురావాలని ఒయాసిస్ విద్యాసంస్థల ట్రెజరర్ జన్ను అరుణ పరంజ్యోతి అన్నారు. నగరంలోని దేశాయిపేట రోడ్ లో గల ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ లో మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అరుణ పరంజ్యోతి మాట్లాడుతూ స్త్రీ అమ్మగా అమృతాన్ని పంచుతుంది, సహోదరిగా అభిమానాన్ని పంచుతుందని, భార్యగా అనురాగాన్ని పంచుతుందని, అత్తగా ఆలోచనలను పంచుతోందని, కూతురుగా ఆనందాన్ని పంచుతుందని, కోడలుగా ఆదరణ పంచుతుందని తెలిపారు. అర్థం చేసుకునే ఓర్పు అంతులేని సహనం, సాధించగలిగే మనోబలం గుండెల్లో దాచుకునే ఔదార్యం స్త్రీలోని సౌందర్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


