TRINETHRAM NEWS

జనసైనికుల సందడి…
జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం…
అధిక సంఖ్యలో హాజరైన కార్యకర్తలు…

మండపేట:- మండపేట నియోజకవర్గ నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో జనసైనికులు సోమవారం సందడి సృష్టించారు. మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి జనసేన మరియు తెలుగుదేశం నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. అనంతరం కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాలలతో ఆయనను ముంచెత్తారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లీలాకృష్ణకు శాలువాలతో ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ జనసైనికులు తనను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన ఎప్పుడు ముందుంటుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండి వారి కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా దశలవారీ ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పలు సామాజిక వర్గాలకు నాయకులు, జనసేన మరియు తెలుగుదేశం నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.