TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకు నియోజవర్గం అనంతగిరి మండలం త్రినేత్రం న్యూస్ మార్చి 26: అలుపెరగని జనసేన యువ నాయకులు ప్రజల కష్టాలే తమ కష్టాలుగా, అనుకోని. ప్రజల మధ్యకి. నిరంతరం ప్రజల కష్టాలు తెలుసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తెలియపరుస్తున్న. అల్లూరిజిల్లా అరకు నియోజకవర్గ ఇన్చార్జి చెట్టి చిరంజీవి, అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి.గత రెండు నెలల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో అనంతగిరి మండలం లో బల్లాగరువు గ్రామం నుంచి రాచకిలం వరకు రోడ్డు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణంలో కొరపర్తి గ్రామంలో పాఠశాల భవనం తనికి చేశారు.

అక్కడ భవనం శిథిలవస్థకు చేరుకుందని బాత్ రూమ్ లు లేవు ,ప్రహరీ గోడలు , బోర్ లేవని చలించిపోయారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తన సొంత నిధులతో అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ ద్వారా పాఠశాల భవనం,ప్రహరీ, బోర్,వంటి అభివృద్ధి పనులు చేయిస్తున్నారు స్థానిక అరకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ చెట్టి చిరంజీవి,అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి. మంగళవారం గ్రామానికి సందర్శించి స్థానిక గ్రామస్తులకు జరుగుతున్న పనులు కార్యక్రమాలు కోసం అడిగితెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి తమ సొంత నిధులతో ఒక గిరిజన పల్లెకు ఇంతా అభివృద్ధి పనులు చేయడం మాకు ఎంతో సంతోషమని మా ఊరు నుంచి గ్రామ ప్రజలందరూ కూడా ఇకపై అతని వెంటే ఉంటామన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా ఎందరో అధికారులకు మా మొర వినిపించిన పలితం లేకపోయిందని, కానీ అతను రాకతో గ్రామ పరిస్తితి మారిపోయిందని అతని రుణపడి వుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ,చెట్టి చిరంజీవి అరకు నియోజకవర్గం ఇంచార్జీ, అనంతగిరి మండల అధ్యక్షులు,చిట్టం మురళి అరకు నియోజవర్గ నాయకుడు రఘునాథ్ నియోజవర్గ ఐ టీ ఇంచార్జీ దండుసేన నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు కూర రమేష్, పెద్దలబుడు మాజీ ఉపసర్పంచ్ సత్యానందం , మండల నాయకులు పాంగి లక్ష్మణ్, కొర్ర రవి, పి చిన్న, వి శ్రీను, పినకోట పంచాయతీ గడ్డిదొర పైడితల్లి, ఠాగూర్ నాగేశ్వరరావు, ప్రసాద్ స్థానిక గ్రామస్తులు ,మహిళలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena Party youth leaders