
Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 24 : కాంగ్రెస్ పార్టి అగ్ర నేత లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో డివిజన్ వారిగా చేపట్టే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ అనే కార్యక్రమం గురించి ఈ రోజు సామ్రాట్ హోటల్ బాలానగర్ లో మేడ్చల్ మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూకట్ పల్లి నియోజకవర్గం తరపున కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు.
ఈ విధంగా బండి రమేష్ మాట్లాడుతు రాహుల్ గాంధీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ అనేది సమానత్వం, న్యాయం మరియు భారత రాజ్యాంగం యొక్క విలువలను నిలబెట్టడానికి అని రాజ్యాంగ సూత్రాలను బలోపేతం చేయడానికి మనం కలిసి పని చేయాలి అని చెప్పారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టి తరపున నాయకులు, కార్యకర్తలు డివిజన్ల వారిగా ప్రచారం చేయాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లు, మాజీ ఎమ్మెల్యే లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, డివిజన్ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
