
త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. దమ్మపేట మండలం. గండుగులపల్లి క్యాంపు కార్యాలయం, మరియు అశ్వారావుపేట మండల కేంద్రంలో. ప్రభుత్వ, క్యాంపు కార్యాయాలలో, పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులు, గ్రామశాఖ అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు , అవగాహన సమావేశం ఏర్పాటు చేసిన , అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు జారే ఆదినారాయణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత పేద, ప్రజల అభ్యున్నతి కోసం.
అనేక, సంక్షేమ అభివృద్ధి పథకాలను మన పార్టీ తీసుకొచ్చిందని. ప్రభుత్వం అందించే ప్రతి పథకం, గ్రామస్థాయికి చేరవేయడానికి కాంగ్రెస్ నాయకులు విశేషంగా కృషి చేయాలన్నారు, గ్రామస్థాయి. మండల స్థాయిలలో వర్గ, విభేదాలకు, తావులేకుండా మనమంతా ఒక్కటిగా కలసికట్టుగా. పనిచేసి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం విశేషంగా కృషి చేయాలన్నారు. పార్టీ పటిష్టంగా ఉంటే కష్టపడే ప్రతిఒక్కరికి పదవులు వాటంతట అవే, వస్తాయని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాదించాలన్నారు. ప్రజలతో సత్సబంధాలు కలిగి ప్రజలకు అందుబాటులో ఉండే వారికే తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.
అలాగే ఏదయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఆ పార్టీకి సహకారం అందించే ఇతర పార్టీలు భారత రాజ్యాంగాన్ని వారి స్వలాభం కోసం మార్చాలని చూస్తున్నాయని, అదే విధంగా స్వాతంత్ర్య. సమరయోధులను, అవమాన పరుస్తూ ముఖ్యంగా ఇంతగొప్ప రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించిన డాక్టర్. బాబా. సాహెబ్ అంబేద్కర్ .ని రాజ్యాంగ, నిర్మాతలను, కించపరిచే విధంగా అవలంభిస్తున్న తరుణంలో, అటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను . మానుకోవాలని దేశ ప్రజలకు నష్టం జరిగితే కాంగ్రెస్ పార్టీ సహించబోధని తెలిపారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
