
తేదీ : 05/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం విస్సన్నపేట నుండి తిరువూరు, ఏ కొండూరు, విజయవాడ వెళ్లే నాలుగు రోడ్ల సెంటర్ యందు ఉన్నటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు బహుజన దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఐక్యవేదిక అధ్యక్షులు ముత్తం శెట్టి. శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి కొండా.
రాజు కుమార్, గ్రామ సర్పంచ్ పి. నాగమల్లేశ్వరి, కోటి ఐక్యవేదిక నాయకులు పి. లక్ష్మయ్య , లాయర్ ప్రకాష్, రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వర స్వామి, కె. మోహన్ రావు, యేసు రత్నం, రాంబాబు, నాగేశ్వరావు, సిపియం నాయకులు నాగరాజు, హరినాథ్ ప్రభాకర్ రావు , తిరుపతిరావు, వెంకటరత్నం, రాజేష్, కె. భాస్కర్ రావు, పి. బాబురావు కె. యాకూబ్, బి. వెంకటేశ్వరరావు అదేవిధంగా ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ గ్రామం నుండి కూడా బాబు జగ్జీవన్ రామ్ యూత్ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం.
యన్ టి ఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, పుట్రేల, తెల్లదేవరపల్లి, వివిధ గ్రామాల నుండి బహుజన దళిత ఐక్యవేదిక నాయకులు, సభ్యులు , అందరూ మరియు వికాస్, సిద్ధార్థ పాఠశాల, కళాశాల యాజమాన్యం , కరెస్పాండెంట్ కుమార్ వారి విద్యార్థులు పాల్గొనడం చరిత్రలో వలసిన మాటలు.
బహుజన దళిత ఐక్యవేదిక అధ్యక్షులు మరియు కార్యదర్శి, సభ్యులందరూ కూడా గ్రామ సర్పంచ్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ , మరియు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి లడ్డు ,మిఠాయిలు మిచ్చిరి వచ్చిన వారికి ఎటువంటి లోటు లేకుండా పంచిపెట్టి చూసుకోవడం జరిగింది. వారందరూ మాట్లాడుతూ వారి ఇద్దరి జీవిత చరిత్రను వచ్చిన వారికి వివరించి తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా వారి మార్గంలో నడవాలని సూచించారు.
కార్యక్రమం చివరి దశలో రాజకీయ పార్టీలు జరుగుతున్నటువంటి బహుజన దళిత ఐక్యవేదిక మీటింగ్ ను చివరి దశలో ఆపివేయాలని ప్రయత్నించగా ఎక్కువ సమయం జరిగే ఈ ఈ మీటింగు ను తక్కువ సమయంలోనే వేదికపై ఉన్న ప్రతి ఒక్కరు తమ మాటల ద్వారా వచ్చినటువంటి వారికి ప్రసంగలు వినిపించారు. అదేవిధంగా ఈనెల 11వ తేదీ జ్యోతి రావు పూలే, జయంతి, మరియు డాక్టర్ అంబేద్కర్ జయంతి ఈనెల 14వ తేదీన ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. అందరూ ఆహ్వానితులే అని పేర్కొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
