TRINETHRAM NEWS

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

Dec 13, 2024,

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : జగన్ అక్రమాస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐ, ఈడీ కేసుల స్టేటస్ వివరాలు నిన్న సాయంత్రం ఫైల్ చేసినట్లు సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. సీబీఐ దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్ కాపీ తాము పరిశీలిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం పేర్కొంది. తాము కూడా చూడటానికి కొంత సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు. జనవరి 10న తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App