ఇది ట్రైల్ మాత్రమే…
ఇంకా చాలా నియోజకవర్గాల్లో మార్పులు ఉన్నాయి…
వైసీపీ నేతలతో అత్యవసర భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
📢ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులతో కొద్ది సేపటి క్రితమే జగన్ సమావేశం ఏర్పాటు చేశారు..
అందుబాటులో ఉన్న మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు.
📢గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ, శాసనమండలి సభ్యుడు మురుగుడు హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇందులో పాల్గొన్నారు…
📢ఆళ్ల రామకృష్ణారెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి రాజీనామాల వ్యవహారం వల్ల మంగళగిరి, గాజువాక నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టడానికి గల కారణాలను క్షున్నంగా వివరించాలని సూచించారు..
📢మున్ముందు మరిన్ని మార్పులు ఉంటాయనే సంకేతాలను వైఎస్ జగన్ పంపించారు అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరం లేకపోవడం వల్ల ఇప్పటి నుంచే స్థానిక నాయకత్వాల్లో మార్పులు చేర్పులు చేయక తప్పదని చెప్పారు ..
📢దీనికోసం పార్టీ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుందని సూచించారు. పనితీరు సరిగ్గా లేని నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జీల నియామకం తప్పదని తేల్చి చెప్పారు…
📢ఈ నేపథ్యంలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సీటు భయం పట్టుకుంది…