
తేదీ : 21/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సంక్షేమ పథకాల వల్ల వ్యవసాయ కార్మికులు సోమరిపోతులుగా మారిపోతున్నారని అత్యుత్తమ న్యాయస్థానం పేర్కొనటం బాధాకరమని జిల్లా కేంద్రమైన విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు ఏర్పాటుచేసిన చర్చ వేదికలో సి.పి.ఐ .యం. యల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ విమర్శించారు. ఈ సమావేశానికి దడాల.
సుబ్బారావు, సిహెచ్. కోటేశ్వరరావు అధ్యక్షత వహించడం జరిగింది. సీ.పీ.యం రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి .విల్సన్ వెంకటేశ్వర్లు, యం. సి.పి.ఐ కార్యదర్శి ఖాదర్ భాషా, పి. జములయ్య , అక్కినేని వనజ , రమాదేవి , దుర్గ భవాని , రవీంద్రనాథ్, తదితరులు పాల్గొనడం జరిగింది. కార్పొరేటర్లకు కో ట్లాది రూపాయలు రాయతీలు కల్పిస్తూ వ్యవసాయ కార్మికులకు జీవనోపాధి కల్పించలేక ఎన్నికల ముందు అధికార పగ్గాలు చేపట్టడానికి సూపర్ సిక్స్ హామీలు వెరగా వేస్తున్నారని.
ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం మెరుగుపరచలేవని ప్రతి ఒక్కరికి ఒక. హె క్టర్ చొప్పున భూములు పంపిణీ చేయాలని , సంపద సృష్టించే కార్మికులను సోమరిపోతులుగా మారిపోతున్నారని వ్యాఖ్యానించటం బాధాకరమని, కరోనా లాంటి కష్ట సమయంలో కూడా జిడిపి వ్యవసాయ రంగంలో ఉన్న కార్మికుల శ్రమ వల్లే పెరిగిందనె విషయాన్ని గుర్తించాలని, కేంద్ర బడ్జెట్ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు మంజూరు చేయకుండా కోత పెట్టారని, ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం ఇవ్వకుండా చేస్తున్న మోసం పారిశ్రామిక దిగ్గజాలను అత్యున్నత న్యాయస్థానం శిక్షించాలని డి .హరినాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
