It is the responsibility of the governments to protect the property of the tribals and stop the oppression of innocent tribals
ఏఐటీయూసీ, టిజిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు నరాటి ప్రసాద్, భూక్యా శ్రీనివాస్
టిజిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
కొత్తగూడెం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కొత్తగూడెం ఆదునికతకు దూరంగా కొండకోనల్లో నివసించే ఆదివాసీల అభివృద్ధిని పాలకులు పూర్తిగా విస్మరించారని, ఆదివాసీలను కేవలం ఓటుబ్యాంకుగానే ఏలికలు పరిగణించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్, తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని తెలంగాణ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అడవి బిడ్డల ఆరాధ్యులు కొమరం భీమ్, బిర్షా ముండ, సేవాలాల్ చిత్రపఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆదివాసీలను గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన భాద్యత కేంద్ర, రాష్ట్ర పాలకులదేనన్నారు. ఆదివాసీల జీవన విధానాన్ని గుర్తించి వారి అభ్యన్నతికోసం పాలకులు కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఐఖ్యరాజ్య సమితి ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు.
అడవులనే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులను ఆ అడవుల నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని, అడవుల పరిరక్షణ పేరుతో దాడులు, నిర్భందాలకు పాల్పడుతూ గిరిజనుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మల్లిస్తుండటంతో గిరిజన గ్రామాలు కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదన్నారు.
కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గిరిజనుల సంక్షేమంకోసం రూపొందించిన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ఆదివాసీలు అభివృద్ధి సాధించలేకపోతున్నారన్నారు.
కొమరంభీం, బిల్షముండ, సేవాల్, మల్లుదొర, సమ్మక్క, సారక్క లాంటి ఎందరో ఆదివాసీ నాయకులు రాజ్యాంగం కల్పించిన చట్టాల అమలు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి స్పూర్తితో హక్కుల సాధన, పెట్టుబడి దారుల ఆదిపత్యం నుండి బైటపడేందుకు ఆదివాసీ గిరిజనులు సంఘటితమై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జి వీరస్వామి, మాజీ సర్పంచ్ నాగేష్, చందర్, శంకర్, మహేష్, సక్రం, జోతియా, కిషన్, మనోజ్, చిరు, బాలాజీ, వెంకటేష్ ,పండు, భరత్, భావుసింగ్, టింకు, సంతు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App