TRINETHRAM NEWS

కశ్మీర్ ఈ రోజు మనదేశంలో ఉంది అంటే ప్రధాన కారణం కశ్మీర్లోనే కశ్మీర్ కోసం పోరాడి అక్కడి జైలులోనే మరణించిన స్వర్గీయ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ..

బీజేపీ పూర్వ రూపం భారతీయ జనసంఘ్ అధ్యక్షులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ …వారి మరణంపై ఎన్నో సందేహాలు తలెత్తినా ఒక్క విచారణ కూడా లేదు…

దేశం కోసం ఒక కుటుంబం త్యాగం చేసింది అంటారు కానీ జనసంఘ్ అధ్యకులు ఇద్దరూ అనుమానాస్పదముగా మృతి చెందారు…అయినా కూడా వారి మరణాలపై విచారణ ఉండదు, మీడియా కూడా చెప్పదు మనకు…

కశ్మీర్ కోసం యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ రన్వే దెబ్బతింటే ఒక్కరోజులో అది సరిచేసి విమానాలు వచ్చేలా చేసింది సంఘ్ కార్యకర్తలు… ఒక్కరోజు ఆలస్యమైనా ఆరోజు మరింత కశ్మీర్ ప్రాంతం పాకిస్థాన్ అక్రమణలోకి వెళ్ళేది అనేది జగమెరిగిన సత్యం…

నాటి సంఘ్ నాటిన విత్తనాలే మహావృక్షాలై ఆర్టికల్ 370 రద్దుకు నిర్ణయం తీసుకున్నాయి…70ఏళ్లపాటు వేలాదిమంది సైనికుల మరణాలకు కారణమైన కశ్మీర్ కాష్టాన్ని ఆర్పివేసింది నేటి నరేంద్రమోదీ మరియు అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం…

నేడు సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధమే అని సమర్థించడంతో ఇక శాశ్వతంగా సమస్య పరిష్కారం అయినట్లే…

కానీ కాంగ్రెస్ అనే ఒక విషపు పార్టీ మనకు దాపురించింది, ఆర్టికల్ 370 నిర్ణయం మీద వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేసిన ఆ పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత మన అందరిదీ…

జై హింద్ జై భారత్