Employment Guarantee Scheme : ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును..తొలగించడం సిగ్గు చేటు

TRINETHRAM NEWS

మూడావత్ మల్లేష్ నాయక్

డిండి (గుండ్ల పల్లి) జనవరి 06 త్రినేత్రం న్యూస్. పేదల సంక్షేమం కోసం ప్రజల అవసరాలకనుగుణంగా ప్రజలు తమ గ్రామాలలోని వ్యవసాయ భూముల్లో పనిచేసుకొని ఉపాధి పొందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించడం సబబు కాదని కాంగ్రెస్ డిండి పట్టణ మాజీ అధ్యక్షులు మూడావత్ మల్లేష్ నాయక్ అన్నారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని భారత స్వాతంత్య్రం కోసం పోరాడి స్వాతంత్య్రం రావడానికి ప్రధాన కారణమైన మహత్మా గాంధీ పేరును తొలగించడం సిగ్గు చేటని తక్షణమే మహత్మాగాంధీ పేరు తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

remove Mahatma Gandhi's name from the employment guarantee scheme

You cannot copy content of this page

Scroll to Top