
Trinethram News : జానారెడ్డి దృతరాష్ట్రుడి పాత్ర పోషించి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు. ఒకే ఇంట్లో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉన్నప్పుడు, ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి?
మంత్రి పదవిపై తన అసహనాన్ని బహిర్గతపరిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటంలాగా కాదు, బాధ్యతగా వ్యవహరిస్తా
మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు.. కెపాసిటీని బట్టి వస్తుంది. 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ముఖ్యమంత్రికి, మంత్రులకు ఇంచార్జీ బాధ్యతలు ఇస్తే ఎంపీలను గెలిపించలేదు.
ఒక ఎమ్మెల్యేగా నేను భువనగిరి ఎంపీని గెలిపించా. నా మంత్రి పదవి విషయంలో జానారెడ్డి, కొందరు దుర్మార్గులు దృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్ప అడుక్కునే పోసిషన్లో ఉండడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
