TRINETHRAM NEWS

ఇకనుండి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Trinethram News : హైదరాబాద్ : జనవరి 27
ఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు నుంచి అమల్లోకి రానుంది.

అవును వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి(UCC) జనవరి 27,సోమవారం నుండి ఉత్తరాఖండ్ లో అమల్లోకి రానుంది.

గతేడాది ఫిబ్రవరిలో ఈ విధానాన్ని ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్‌ ఇప్పటికే ప్రకటించింది.

అయితే తాజాగా ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించా రు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుందని అన్నా రు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, విధానాల ను పూర్తి చేశామన్నారు.

ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. మీడియాతో మాట్లాడిన ధామి.. యూసీసీ అమలు వలన అన్ని మతాలు, కులాలు ఒకేథాటిపైకి వస్తాయన్నా రు. ఎలాంటి వివక్ష ఉండదని వివరించారు. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీను అమలు చేస్తామని మాట ఇచ్చా మని.. ప్రధాని మోదీ నాయ కత్వంలో ఆ ఎన్నికల్లో గెలి చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అనుగుణంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్ లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ యూసీసీ నే బీజేపీ ప్రధానాస్త్రంగా ఉంటోంది. ఎట్టకేలకు ఈ సారి అమలు చేసేందుకు మార్గం సుగమమైంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App