
శివరాత్రి పండుగ ఏర్పాట్లు పట్టించుకోని ప్రభుత్వం, నగర పాలక సంస్థ అధికారులు
కనీసం సింగరేణి సంస్థ అయిన పట్టించుకోవాలి
నది ఒడ్డున ఉన్న శివుని భారీ విగ్రహానికి రంగులు వేయాలని డిమాండ్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
శివరాత్రి పండుగ సందర్భంగా గోదావరి నది లో పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు కెమికల్, మురికి నీరే గతా అని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఒక ప్రకటన లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారుల ను ప్రశ్నించారు. ఈ నెల 26 న జరిగే శివరాత్రి పండుగ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు పుణ్య స్నానాలు చేసేందుకు వస్తారని, వారు స్నానాలు చేసేందుకు నదిలో నీరు లేదని, పూర్తిగా ఎండిపోయి ఉందని, భక్తుల సౌకర్యార్థం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. కనీసం షవర్స్ కూడా ఇంత వరకు ఏర్పాటు చేయలేదని ఆయన ఆరోపించారు.
భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా నది ఒడ్డున ఉన్న శివుని భారీ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దడం లో అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆయన ఆరోపించారు, వెంటనే అట్టి విగ్రహానికి రంగులు వేసి గోదావరి తీరాన ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు.
వాస్తవానికి ప్రజలకు ఉపాయోపడే పనులు ఏనాడు కూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పనిచేయరు, అధికారులకు ప్రజల పట్ల శ్రద్ద ఉండదు కేవలం కమిషన్, పర్సెంటిజిలు అల్వాటు పడి అవినీతి మత్తులో తూలడం లోనే సమయం సరిపోవడం లేదు వారికి, కావున కనీసం సింగరేణి యాజమాన్యం అయినా ఆలోచన చేసి గోదావరికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని అయిన కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజల పక్షాన దినేష్ కోరడం జరిగిందన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
