జాతీయ విద్యాసదస్సుకు ఆహ్వానం
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఢిల్లీలో ఫిబ్రవరి 9న నిర్వహించే నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఈ లెర్నింగ్ సదస్సులో పాల్గొనాలని డిండి మండలం తవ కలపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలరాజుకు ఆహ్వానం అందింది.
విద్యా విధానంలోని నూతన పోకడలు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ-లెర్నింగ్ ఆవశ్యకతను సదస్సులో ప్రసంగించ నున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. బాలరాజుకు ఎంఈఓ గోపియా నాయక్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, గణేష్, రమేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App