సలీం మృతి మిస్టరీ పై విచారణ జరిపించండి
పెద్దాపురం డిఎస్పీకి వినతి పత్రం అందించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, పెద్దాపురం, జనవరి 30: జర్నలిస్ట్ షేక్ సలీం మృతి మిస్టరీ పై పోలీసులు లోతుగా విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కోరుతూ సలీం కుటుంబ సభ్యులు జర్నలిస్టు సంఘ నేతలు పెద్దాపురం డి.ఎస్.పి శ్రీహరి రాజుకు ఫిర్యాదు చేశారు. జనవరి 9వ తేదీన సామర్లకోట భీమేశ్వర స్వామి బ్రిడ్జి కాలువలో పడిపోయిన సలీం మృతదేహం 29వ తేదీన పాత బొంబాయి చెరువు కాలువలో మృతదేహం లభ్యం కావడం, 20 రోజులు పాటు ఆ మృతదేహం కాలువలో ఉన్నప్పటికీ కుళ్ళిపోకపోవడం, కిలోమీటర్ మేర లాకులు దాటి మృతదేహం లబ్బింగ్ కావడం వంటి అంశాలతో పాటు సలీం కాలువలో దూకేసారని చెబుతున్న ప్రత్యక్ష సాక్షి ఓ మహిళ తోపాటు మరికొందరు సలీం మృతికి కారకులు కావడం ఆయన ఆస్తిని కాల్ చేయడం వంటి అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని,
ఆర్టికల్ 370 రోజులు పాటు సలీం మృతదేహం గాలించకుండా పోలీసులు తాత్సారం చేయడం వంటి అంశాలను డీఎస్పీ దృష్టికి కుటుంబ సభ్యులు జర్నలిస్టులు స్థానికులు తీసుకువచ్చారు కాబట్టి సలీం మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు సలీం కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, ఈ కేసును క్రిమినల్ స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సలీం భార్య ఈశ్వరి ఇద్దరు కుమారులు, జర్నలిస్టు సంఘ నాయకులు నవీన్ రాజ్, మున్ని, అధికార్, దళిత సంఘ నాయకులు లింగం శివ, పెద్దాపురం కౌన్సిలర్ ఎండి జిలాని, పెదపూడి మండల జర్నలిస్టు లు, సలీం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App