TRINETHRAM NEWS

కొటాలగూడ గ్రామపంచాయతీలో జాతీయ జెండాకు అవమానం
వికారాబాద్ జిల్లా జనవరి 26 వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలో ఆదివారం జాతీయ జెండాకి అవమానం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ గ్రామపంచాయతీలో ఆదివారం జెండా ఆవిష్కరణ చేయబోవుచుండగా జెండా ఆవిష్కరణ కాకపోవటంతో గణతంత్ర దినోత్సవానికి అవమానం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. జాతీయ జెండా ఆవిష్కరణ కాకపోవడంతో జెండా పక్కన స్టాండ్ వేసి కర్రతో జాతీయ పతాకానికి ఉన్న ముడిని విప్పెందుకు ప్రయత్నించడం ఎంతవరకు సరి అయిందో ఉన్నతాధికారులే ఆలోచించాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App