భారత నౌకాదళ అమ్ముల పొదలో చేరిన మరో అస్త్రం ‘ ఐఎన్ఎస్ ఇంఫాల్ ‘
భారత నౌకాదళంలో మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ గైడెడ్ డిస్ట్రాయర్ యుద్ద నౌక ‘ INS ఇంఫాల్ ‘ భారత నేవీలో చేరింది.
ముంబాయి లోనీ నావెల్ డాక్ యార్డ్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీనిని జాతికి అంకితం చేశారు. దేశ భద్రత, హిందూ మహా సముద్రంలో చైనా దేశ నేవి కదలికలు పెరుగుతున్న వేళ ఈ INS ఇంఫాల్ భారత రక్షణ సామర్థ్యాలను మరింత పదును పెట్టనుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.