TRINETHRAM NEWS

Indian rice : భారత్‌ బియ్యం.. కిలో రూ.25!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఓ కొత్త సంక్షేమ పథకంపై దృష్టి పెట్టింది. మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా పరిణమించిన దృష్ట్యా..

Indian rice : భారత్‌ బియ్యం.. కిలో రూ.25!

.

కొత్త పథకంపై కేంద్రం కసరత్తు

ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయం

ఇప్పటికే సబ్సిడీపై గోధుమపిండి, శనగపప్పు

ఏడాదిలో 14.1% పెరిగిన బియ్యం ధరలు

న్యూఢిల్లీ, డిసెంబరు 27: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఓ కొత్త సంక్షేమ పథకంపై దృష్టి పెట్టింది. మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా పరిణమించిన దృష్ట్యా.. ‘భారత్‌ రైస్‌’ పేరుతో రూ.25కు కిలో చొప్పున బియ్యాన్ని విక్రయించే యోచన చేస్తోంది. ఇప్పటికే భారత్‌ ఆటా పేరుతో రూ.27.50కు కిలో చొప్పున గోఽధుమ పిండిని, భారత్‌ దాల్‌ పేరుతో రూ.60కి కిలో శనగపప్పును కేంద్రం అందిస్తోంది. వీటిని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (నాఫెడ్‌), జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య(ఎన్సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్‌ దుకాణాలు, మొబైల్‌వ్యాన