TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:జనవరి 17
సంక్రాంతి పండుగ 2024 అట్టహాసంగా ముగిసింది. భాగ్యనగరంలో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్లారు.

బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది.

ఈ మూడు రోజులు హైదరాబాద్ నగరం బోసిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు మరికొద్ది గంటల్లో భాగ్యనగరం కళకళలాడ బోతోంది. ఇప్పటికే ఇళ్లకు వెళ్లిన వారంతా తిరిగి పయనమయ్యారు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసులు కొన్ని సూచనలు చేశారు..సూర్యాపేట, ఘాట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాల వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు.

ఘట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 12 బూతులకు గానూ 6 బూతులను హైదరాబాద్ వైపు తెరిచారు . ఇక 10 ఫాస్టాగ్ ఎంట్రీ ఉండగ రెండు బూతులు మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయిం చారు.

జనగామ, వరంగల్- నిజామాబాద్, సిద్దిపెట్, విజయవాడ, కర్నూల్ ఘట్ కేసర్ టోల్ ప్లాజా మీదుగా వాహనాలు హైదరాబాద్ చేరుకుంటున్నాయి. ..