గుంటూరు నగరంలోని రైల్వే స్టేషన్ నందు దక్షిణ మధ్య రైల్వే వారి ఆధ్వర్యంలో గుంటూరు నుండి విశాఖపట్నం,నర్సాపూర్ నుండి హుబ్లీ మరియు రేణిగుంట నుండి నంద్యాల వరకు వేళ్ళు నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించి,తదుపరి జెండా ఊపి రైలు సర్వీసులను ప్రారంభిస్తున్న కేంద్ర సాంస్కృతిక పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి,గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు
ఈ కార్యక్రమంలో DRM రామకృష్ణ,మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య,జాతీయ లేబర్ కమిషన్ చైర్మన్ జయప్రకాష్,BJP గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర,ఇతర నాయకులు,రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.