TRINETHRAM NEWS

ఏపీ క్యాబినెట్ ముఖ్య నిర్ణయాలు

Trinethram News : అమరావతి :

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతోన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.

1)ధాన్యం సేకరణకు సంబంధించి లోన్ కోసం మార్కెఫెడ్క అనుమతి ఇవ్వనుంది కేబినెట్.

2)గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ వ్యవస్థపై చర్చ జరుగుతోంది.

3)62 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకోనుంది ఏపీ కేబినెట్.

4) ధాన్యం కొనుగోలు కోసం 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్ ఫెడ్కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్ అనుమతి ఇచ్చింది.

5)గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషన్లజేషన్ ప్రతిపాదనపై చర్చ జరిగింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చించారు.

6)మరోవైపు ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

7)నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ పై కుడి, ఎడమ వైపు మిని హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

8)కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్ కు కేటాయించిన 2,595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది..

9)అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదన పైనా కేబినెట్ లో చర్చించారు.. ప్రస్తుతం కేబినెట్ సమావేశం కొనసాగుతుండగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో వెల్లడించాల్సి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App