అమలు కానీ హామీలు పర్వము గిరిజనులను యెంత కాలం మోసం చేస్తారు
(కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిన్నాస్వామి)
అరకులోయ,త్రినేత్రం న్యూస్, జనవరి 21.
రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు జీఓ నెంబర్ 3 చట్టబద్ధత ఆర్డినెన్స్ తీసుకొస్తాను గిరిజనులకు ఇచ్చిన మాట నెరవేర్చాలి నేటికీ సంవత్సరము పూర్తి అయింది!
కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల గిరిజన నాయకులు స్పందించాలి. ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచి పెంట శాంతకుమారి ఆదేశాల మేరకు అరకు నియోజకవర్గ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజనులకు నూతన ఉద్యోగ భద్రత చట్టం కల్పించాలని,జీ ఓ నెంబర్ 3 ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించాలని, ప్లే కార్డు పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచి పెంట చిన్నస్వామి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రతిపక్ష హోదాలో గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇదే రోజు తేదీ 20 -01- 2024న వేలాది మంది సమక్షంలోబహిరంగ సభ నందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గిరిజనులకు నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు ఏర్పాటు, గిరిజన నూతన ఉద్యోగ చట్టం జి ఓ నెంబర్ 3 చట్టబద్ధత కల్పిస్తాను, స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ బ్యాక్లాగ్ పోస్టులు నోటిఫికేషన్ గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను,అని ఇచ్చిన హామీ నేటికీ సంవత్సరము పూర్తి అయింది .
ఈ సందర్భంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో చేపట్టి సుమారు 7 నెలలు అయింది గిరిజనుల కోసం ఎటువంటి అభివృద్ధికి ఉద్యోగ అవకాశాలకు చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం, ముఖ్యమంత్రివర్యులు గిరిజనులకు ఇచ్చిన హామీ తక్షణమే నెరవేర్చాలని, గిరిజనుల తరపున కూటమి రాష్ట్ర ప్రభుత్వము గిరిజన కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు గిరిజన సమస్యలపై స్పందించాలనికాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాంగి గంగాధర్, గొల్లూరి మంగు, శెట్టి భగత్ రాం, చిట్టం నాయక్, బాల బధర్, కోర్ర రఘురాం, కోర్రమితుల,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App