Immortal constable Kishtaiah’s wife who is overcome by the officer’s arrogance
Trinethram News : తెలంగాణ రాకుండా అడ్డుకోలేకపోయాము కానీ తెలంగాణా ఏర్పాటుకు ముఖ్య కారణమైన కిష్టయ్య యొక్క భార్యకు లైబ్రరీయన్ పోస్ట్ రాకుండా అయినా అడ్డుపడతామని సవాల్.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పద్మావతి . వీరు కీర్తిశేషులు కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి
కానిస్టేబుల్ కిష్టయ్య బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన విషయం అందరికి తెలిసిందే.
కిష్టయ్య బలిదానం తర్వాత అప్పటి ప్రభుత్వం పద్మావతి కి ఇంటర్ విద్యా శాఖలో ఉద్యోగం కల్పించింది.
ఆ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తిస్తునే లైబ్రరీయన్ గా ఎదగాలని సంకల్పంతో కష్టపడి చదివి దానికి సంబంధించిన అర్హతను సాధించింది.
ఆ తరువాత జూనియర్ కళాశాలలో లైబ్రరీయన్ గా సేవలు అందించాలని అందరితో పాటే దరఖాస్తు చేసుకున్నది.
ఇంటర్ మీడియట్ విద్యలో మల్టిజోన్ 1లో 60 ఖాళీలు ఉండగా దురదృష్టవశాత్తు ఆమె నెంబర్ 61.అయినప్పటికీ ఆమె పేరును డిపార్ట్మెంట్ కమిటీ అప్రూవ్ చేసి ఈ 60 మందిలో ఏ ఒక్కరు చేరక పోయిన ఆమెకు ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నది.
పై 60 మందిలో ఏకంగా ముగ్గురు తమ వ్యక్తిగత కారణాల చేత ప్రమోషన్ వద్దని వ్రాత పూర్వకంగా లెటర్ ఇచ్చినప్పటికీ పద్మావతి కి ప్రమోషన్ రాలేదు.
ఇంటర్ విద్యా శాఖ లోని ముఖ్యమైన ఇద్దరు అధికారులకు మరియు కమిషనర్ గారైన శృతి ఓజా కి అనేకసార్లు మొర పెట్టుకున్నది.
ఆ మొత్తం వ్యవహారాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న ఒక ఆంధ్రా అధికారిణి..
కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణిని 100 సార్లు ఆఫీస్ చుట్టూ తిప్పించుకొని.. ప్యానల్ ఇయర్ పూర్తయ్యింది కాబట్టి నీకు ప్రమోషన్ ఇచ్చేదే లేదు.. నీ దిక్కున్న చోట చెప్పుకుపో అని ఇంటర్ మీడియట్ కార్యాలయం నుంచి గెంటివేసిన దుస్సంఘటన..
ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఈ రోజు గౌరవనీయులు ప్రిన్సిపాల్ సెక్రెటరీ ని కలిసి తన బాధను, గోడును, అవమానాలను, అన్యాయాలను విన్నవించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App