TRINETHRAM NEWS

జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్

గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని నిత్యం
ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ద చూపాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రామగుండం బ్రాంచ్ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ డాక్టర్ లక్ష్మివాణి, మెడికల్ షాప్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ కె.రాజేందర్ కోరారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ సభ్యుల కోసం ఐఎంఏ ఆధ్వర్యంలో సిగ్మా హాస్పిటల్ మేనేజ్ మెంట్ సహకారంతో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్లకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెకప్, గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్ష నిర్వహించారు. సమయానికి ఆహారం తీసుకోకుండా అనేక అనారోగ్య సమస్యలతో చాలా మంది జర్నలిస్ట్లు ఇబ్బందులకు గురవుతున్నారని, వారు కచ్చితంగా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ పందిళ్ళ శ్యామ్ సుందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర, డాక్టర్ దుర్గాప్రసాద్, శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ భైరం సతీష్, క్లబ్ సీనియర్ మెంబర్స్ కోల లక్ష్మన్, అల్లంకి లచ్చయ్య, జక్కం మారుతి, దయానంద్ గాంధీ, కె.చంద్రశేఖర్ రెడ్డి, కెఎస్ వాసు, జర్నలిస్ట్లు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App