జిల్లా: గుంటూరు
సెంటర్: తాడేపల్లి
గుండిమెడ ఇసుకరీచ్ లో రగడ
బిల్లులు లేకుండానే అక్రమంగా ఇసుక తరలింపు??
అదనపు చార్జీల పేరుతో ఇసుక బాదుడు
కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు అడ్డు అదుపు లేదు…
పట్టుకునేది ఎవరు అడ్డుకునేది
ఎవరు..
అటు వైపు కన్నెత్తి చూడని మైనింగ్, భూగర్భ జలాల శాఖ అధికారులు…?
బాట చార్జీల పేరుతో మరికొంత రుసుము వసూలు
విధులు బహిష్కరించిన గుండిమెడ ఇసుక రీచ్ లారీడ్రైవర్లు
ఇసుక నూతన పాలసీ విధానం ఇసుక రీచ్ నిర్వాహకులకు కాసులు కురిపిస్తున్నాయి
వాహనదారుల దగ్గర నుండి బాట చార్జీల పేరుతో అదనపు రుసుమును వసూలు చేస్తున్న నిర్వహకులు
తాడేపల్లి గుండి మెడ ఇసుక క్వారీలలో గుత్తేదారులు బాట చార్జీల పేరుతో అదనంగా కొంత రుసుము ఇసుక వాహనదారులను ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు.
అదేమని ప్రశ్నించిన వాహనదారులతో వాదనకు దిగుతున్నారు.
పది చక్రాల లారీ కు 1500 రూపాయలు, ఆరు చక్రాల లారీకి వెయ్యి రూపాయలు, ట్రాక్టర్ కు 500 రూపాయలు ఇవ్వాల్సిందే అని హుకుం జారించేస్తున్నారు.
ఇప్పటికే ప్రతిరోజు
అక్రమ ఇసుక తరలింపుతో డబ్బులు భారీగా వసూలు చేస్తున్నారు అంటూ ఇసుక నిర్వాహకులపై అభియోగాలు ఉన్నాయి..
గతంలో ఇసుక లారీలు అతివేగంతో యాక్సిడెంట్లకు గురై కొంతమంది కాళ్లు చేతులు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి..
ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం…