హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు విలీన సభను జయప్రదం చేయండి
IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, గొల్లపల్లి చంద్రయ్య పిలుపు
ప్రతినిధి
ఎన్టిపిసి లేబర్ గేటు వద్ద, పెద్దంపేట గ్రామ కేంద్రంలో TUCI లో IFTU విలీన సభకు ముద్రించిన గోడ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ ఆవిష్కరణలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి గొల్లపెల్లి చంద్రయ్య మాట్లాడుతూ ఈ నెల 20న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు జరుగు
టియుసిఐ లోకి, ఐఎఫ్టియు విలీన సభను జయప్రదం చేయాలని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న సంఘటిత అసంఘటితరంగా కార్మికులను విజ్ఞప్తి చేశారు.
14 రాష్ట్రాల్లో సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న టియుసిఐ,లో ఐఎఫ్టియుని విలీనం చేసి, కార్మికుల హక్కుల కోసం, దేశవ్యాప్తంగా కార్మిక వర్గంపై దాడి తీవ్రమవుతున్న తరుణంలో,ఈదాడిని, ఎదుర్కొనేందుకు దేశంలో ఒక బలమైనటువంటి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, కార్మిక హక్కుల కోసం బలమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి కార్మికులకు అండగా నిలవాలని మోడీ, ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులను కడు బానిసలు చేసే ఈ లేబర్ కోడ్ ను అమలు చేయకుండా దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు చేసి కార్మిక హక్కులను కాపాడుకోవాలనే లక్ష్యంతో టియుసిఐ లోకి ఐ ఎఫ్ టి యు విలీనం అని అన్నారు. ఈ విలీన సభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మార్త రాములు, ఆడేపు శంకర్, తూళ్ళ శంకర్, ఇనగాల రాజేశ్వర్, కలువల రాయమల్లు, మాటేటి పోషం, పెండ్యాల ఓదెలు,పెంటయ్య, అనిల్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App