బీసీ బిల్లు పెట్టకపోతే అగ్గిరాజేస్తాం..
బీజేపీ, కాంగ్రెస్ భరతం పడతాం: ఆర్ కృష్ణయ్య రవీంద్రభారతి, ( దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని అన్నారు. బిల్లుకు అన్ని రాజకీయపార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఓబీసీ మంత్రిత్వశాఖ ఏ ర్పాటు చేసి, అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ స్కీమ్ అమ లు చేయాలని కోరారు.
లేకపోతే బీజేపీ సర్కారుపై తిరుగుబాటు తప్పదని, అన్ని పార్టీతో కలసి పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని తేల్చిచెప్పారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆర్ కృష్ణ య్య మాట్లాడుతూ కులగణనపై మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ 60 ఏళ్ల పాలనలో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పటికైనా బీసీ బిల్లు, కులగణన కోసం కేంద్రంపై కాంగ్రెస్ ఒత్తిడి పెంచాలని, లేకపోతే దేశవ్యాప్తంగా అగ్గిరాజేస్తామని హెచ్చరించారు. సానుకూలంగా స్పందించకపోతే బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App