TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బి.వి.రాఘవులు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు.
గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో సిపిఎం సింగరేణి పరిరక్షణ యాత్ర సందర్భంగా బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు కా..బి.వి.రాఘవులు గారు హాజరై మాట్లాడుతూ సింగరేణి సంస్థను మనం కాపాడుకోవడానికి తీవ్ర పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎందుకంటే సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేస్తే సింగరేణిపై ఆధార పడిన
వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. దీంతో పాటు ప్రభుత్వం కూడా నష్టపోయే అవకాశం ఉంది అన్నారు. ఎందుకంటే ఇప్పటికే సింగరేణి సంస్థ లాభాల్లో ఉందని ఈ లాబాల్లోని కొంత నిధులు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం సింగరేణికి వేల కోట్ల రూపాయలు అప్పులు ఉందని అన్నారు. అయినప్పటికీ ప్రజల అభివృద్ధి కోసం సింగరేణి నిధులు ఖర్చు చేస్తున్నారని అన్నారు. సింగరేణి సంస్థ ప్రైవేటు పరం అయితే ప్రజల అభివృద్ధి కోసం ప్రైవేటు కంపెనీలు నిధులు కేటాయించే అవకాశం లేదని అన్నారు.
ప్రజల అభివృద్ధి జరగాలంటే సింగరేణి సంస్థను మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తామని మోడీ ప్రభుత్వం అంటే
4 వేల మంది కార్మికులు ఉద్యమించిన పలితంగా కేంద్ర మంత్రి స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరంచేయమని చెప్పారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణి లో బొగ్గు గనుల వెలంను వ్యతిరేకించినట్లు లేదని అన్నారు. ఎందుకంటే బొగ్గు మంత్రి వేలం వేయాలని పెట్టిన మీటింగ్ లో స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారని అన్నారు. పాల్గొనడం వరకు మంచిదే కానీ సింగరేణి వేలం లో పాల్గొనదని ఎందుకు చెప్పలేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని తెలియచేయాలని అన్నారు.
యాత్ర రథ సారథి ఎస్.వీరయ్య, బృంద నాయకులు భూపాల్,ఆశయ్య, పి.రాజారావు మాట్లాడుతూ ఒకవైపు సిపిఎం అధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్ర జరుగుతుంటే మరోపక్క కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల విషయంలో ఇంతకు ముందున్న చట్టాలను సడలించి ప్రైవేటు వ్యక్తులు కూడా ప్రభుత్వ భూములు కొనుక్కునే అవకాశం కల్పించడం కోసం చట్టాలను సడలించారని అన్నారు. దీనివల్ల పేదలు ప్రభుత్వ స్థలాల్లో వేసుకున్న గుడిసెలు కూడా తొలగించే అవకాశం అవకాశం ప్రైవేటు పెట్టుబడిదారులు చేస్తారని అన్నారు.

అందుకే ప్రజలందరూ పోరాడి సింగరేణి సంస్థ ను కాపాడుకోవాలని అన్నారు.
ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని విరమించుకోవాలని లేని పక్షంలో అన్ని వర్గాల వారిని కలుపుకుని పోరాడుతామని అన్నారు.

ఈకార్యక్రమానికి జిల్లా కార్యదర్శి వై.యాకయ్య అధ్యక్షత వహించగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింగ్ రావు,
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.ముత్యం రావు,వేల్పుల కుమారస్వామి, ఎ .మహేశ్వరి, ఎం.రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి,శంకర్,గణేష్,
కొమురయ్య, ఎం.శ్రీనివాస్,రవీందర్, అశోక్,మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి, బిక్షపతి,నర్సయ్య,
నాగమణి, లతో పాటు వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.