TRINETHRAM NEWS

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన,చర్యలుతప్పవు. అరకు ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం.
అనంతగిరి మండలంలొ సుడిగాలి పర్యటన.

అల్లూరి సీతారామరాజు జిల్ల, త్రినేత్రం న్యూస్, జనవరి26.

అనంతగిరి మండలం టోకురు బాలికల ఆశ్రమ పాఠశాలలో అరకు ఎమ్మెల్యే ఆకస్మికంగా సందర్శించి,రికార్డులను పరిశీలించి అన్నీ విధాల రికార్డులను సక్రమంగా నమోదు చెయ్యాలని ఆదేశించారు. విద్యార్థులకు చదువు బోధించడం నిర్యక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.తదనంతరం పాఠశాలలో ఆహార నాణ్యతను పరిశీలించరు.

అనంతగిరి మండల కేంద్రంలో గల ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో , ఆహార నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.హాజరు పట్టి నీ చూశారు.ఎవరైనా విద్యార్థులు అనారోగ్యం బారిన పడిన చో నిర్లక్ష్యం చేస్తే సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్దులకు ఆహారం విషయంలో శ్రద్ధ చూపాలని ఆని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ శెట్టి నీలవేణి , పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App