TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి

ఏపీలో చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి

ఏపీలో మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది.

రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి, నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది.

పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డ వారు కూడా వెనక్కితగ్గడమో, వాయిదా వేయడమో చేస్తారని పేర్కొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App