Trinethram News : విజయవాడ: టీడీపీ సీనియర్ నేతలు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ..
60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హయాంలో ఏపీ కళకళలాడుతోందన్నారు. ఎక్కడెక్కడి నుంచో యువత ఏపీకి తరలి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఉద్యోగం లేదన్నారు.
తన స్వార్ధంకోసం కార్యకర్తలను అడ్డు పెట్టుకుని ఉద్యోగాలని ప్రచారం చేస్తున్నారన్నారని కేశినేని చిన్ని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు పొట్ట కట్టుకుని తమ పిల్లలను చదివించారన్నారు. ప్రతిభ ఉన్నా అవకాశాలు లేక అనేక మంది వలసలు పోయిన పరిస్థితి నెలకొందన్నారు. 2019కి ముందు… ఆ తరువాత ఏపీలో ఉన్న అవకాశాలపై ఆలోచన చేయాలన్నారు. పరిశ్రమలు, కంపెనీల కోసం చంద్రబాబు స్థలాలు కూడా ఇచ్చారని కేశినేని చిన్ని అన్నారు. వైసీపీ వచ్చాక… మొత్తం వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. దేశ, విదేశాల నుంచి బడా పారిశ్రామిక వేత్తలను తెచ్చి హైదరాబాద్‌ను మోడల్ ఐటీ హబ్‌గా మార్చారని కేశినేని చిన్ని అన్నారు.
విభజన తరువాత అమరావతిలో కూడా ఆ రకమైన వెలుగు తేవాలని తపన పడ్డారని పేర్కొన్నారు. కానీ కుట్ర రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు, భవిష్యత్తు తరాలకు అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు, జగన్‌ల పాలనలో రాష్ట్రం ఉన్న తీరుపై ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలని కేశినేని చిన్ని పేర్కొన్నారు. బాబు వస్తేనే జాబు అనేది వాస్తవమని గుర్తించాలన్నారు. వాళ్లు చేసింది చెప్పుకోలేక .. చంద్రబాబుపై విషం చిమ్ముతున్నారన్నారు. నేడు వేల మంది యువత ఖాళీగా ఉంటూ మానసికంగా ఆవేదన చెందుతున్నారన్నారు. తమవంతుగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు చూపిస్తున్నామన్నారు. మీకు వచ్చిన అవకాశంతో మీ ప్రతిభతో మంచి స్థానాలు సంపాదించాలన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు ఆధ్వర్యంలో మళ్లీ ఉద్యోగ అవకాశాలు అందరికీ వస్తాయని కేశినేని చిన్ని పేర్కొన్నారు.