TRINETHRAM NEWS

మూత్రం రంగును బట్టి కిడ్నీలు పాడయ్యాయో, లేదో ఎలా తెలుసుకోవచ్చు?
శరీరంలోని ఫ్లూయిడ్స్‌ నుంచి అనవసరమైన వ్యర్థాలను, అధిక మోతాదులో ఉన్న నీటిని మూత్రపిండాలు (కిడ్నీలు) వడబోసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి.

భారత్‌లో అనారోగ్యం వల్ల సంభవించే మరణాలకు ప్రధాన కారణాల్లో కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి.

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసర్చ్ ప్రకారం, దేశంలో మరణాలకు కిడ్నీ వ్యాధులు ఒక ప్రధాన కారణమని జాతీయ ఆరోగ్య నివేదిక 2017 పేర్కొంది. డయాబెటిస్, హైబీపీ వృద్ధాప్య సమస్యల కారణంగా ఎక్కువ మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు.

మెడికల్ జర్నల్ ‘నేచర్’‌లో పేర్కొన్న అధ్యయనం ప్రకారం, ప్రపంచంలో దాదాపు 6.97 కోట్ల మంది కిడ్నీ రోగులుంటే, ఒక్క ఇండియాలోనే 1.15 కోట్ల మంది ఉంటారని అంచనా.

2010 నుంచి 2013 మధ్యలో సంభవించిన 15 ఏళ్ల నుంచి 69 ఏళ్లలోపు వారి మరణాల్లో 2.9 శాతం మంది మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్) వల్లే చనిపోయారు. అంతకుముందు దశాబ్దంలో, అంటే 2001 నుంచి 2003 మధ్య కాలంతో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం ఎక్కువ.

కిడ్నీ ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం డయాబెటిస్.