సొంత వారి హననం ఇంకా యెంత కాలం, గిరిజన నాయకుడు అప్పలరాజు దొర.
అల్లూరి సీతారామరాజు జిల్లా:త్రినేత్రం న్యూస్, జనవరి 20.
దండకారణ్యంలో మారణకాండ దృష్టి లో ఉంచుకొని ఆదివాసి నాయకుడూ తన అవేదనను పత్రిక ముఖంగా వేళ్ళబుచ్చారు.ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు ఒకరు ఉద్యోగ ధర్మం అని ప్రాణం తీస్తున్నారు.. ఇంకొకరు ప్రజల తరఫున పోరాటం చేస్తున్నామని ప్రాణాలు తీస్తున్నారు.
ఈ ఇద్దరి మధ్యన దండకారణ్యంలో ఉన్న గూడాలు, తండాలు, మరియు ఓటుతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిదులు నలిగిపోతున్నారు. ఒకపక్క ఆదివాసులు అభివృద్ధి అడ్డుకుంటున్నందుకు ఎన్కౌంటర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకొకరు పచ్చని పకృతిని కార్పొరేట్ సంస్థలకు పంచి పెడుతున్నారని దీనివల్ల ఆదివాసులకు నష్టం కలుగుతుందని అందుకే ఈ మారణకాండ అని మరికొందరు.
ఈ ఇద్దరి మధ్యన నలిగిపోయింది పేద గిరిజనప్రజలు ఇప్పటికైనా ఈ మారణకాండను ఆపి అమాయక గిరిజన ప్రాణాలు కాపాడండి. ఎన్కౌంటర్ అవుతున్న ప్రాంతంలో గూడెంలో ఉన్న గిరిజనులు ఏవిధంగా నలిగిపోతున్నారో ఒక్కరోజైనా పోలీసులు గాని మావోయిస్టులు గాని ఆ పేద ప్రజలు యొక్క ఇబ్బందిని వీడియోల రూపంలో బయట పెట్టలేదు.
అడవిలో తుపాకి శబ్దాలు ఆపండి విలువైన ప్రాణాలును కాపాడండి, అంటూ గిరిజన సంఘం నాయకుడు అప్పలరాజు ప్రభుత్వాన్ని,విజ్ఞప్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App