
Horrific Road Accident : ములుగు జిల్లాలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో వస్తున్న ఇసుక లారీ రెండు వాహనాలను ఢీకొట్టడంతో భారీ ప్రాణనష్టం జరిగింది.
పస్రా – తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్ పోస్ట్ సమీపంలో.. ఈ ప్రమాదం జరిగింది. మొదట CRPF జవానులు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న CRPF జవాన్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
అక్కడితో ఆగకుండా..అదే లారీ ముందుకు వెళ్లి ఎదురుగా వస్తున్న కారును కూడా బలంగా ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణిస్తున్న రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఓవర్ స్పీడ్ మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఒకే లారీ రెండు వాహనాలను ఢీకొట్టడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ కోసం గాలింపు చేపడుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe