
Horrific Incident : ప్రకాశం జిల్లా : త్రినేత్రం న్యూస్ : నాగులుప్పలపాడు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై అదే కాలానికి చెందిన ఆనంద్ అత్యాచారం చేసి , హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో బెల్దారి పనులకు వెళ్లడంతో ఆమె వాళ్ల అమ్మమ్మ వద్ద ఉంటుంది అని స్థానికులు తెలిపారు.
ఆదివారం అర్ధరాత్రి వేళలో ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న ఆ బాలికను నిందితుడు తీసుకెళ్లి ఈ ఘాతకానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం ఆ మృతదేహాన్ని ఇంటి వద్ద కుర్చీలో కూర్చోబెట్టి పరారయ్యాడు. అక్కడి స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe