TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఏ ఎస్ఐ ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) గారు ఉద్యోగ విరమణ పొందుతున్న ఏఎస్ఐ మరియు కుటుంబ సభ్యులను శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈరోజు ఉద్యోగ విరమణ పొందిన వి. వెంకటేశ్వర్లు ఏ ఎస్ఐ 1678, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రామగుండం., 1989 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై అంచలంచలుగా ఎదిగి ఏఎస్ఐ గా పదోన్నతి పొంది కుటుంబ సభ్యుల సహకారంతో 35 సంవత్సరాల, 07 నెలల,12 రోజులు విధులు విజయవంతంగా నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందడం జరిగింది.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ…… సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సేవా చేయడానికి పోలీస్ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. ఉద్యోగ విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. పదవి విరమణ పొందిన అధికారులను ప్రభుత్వ వాహనంలో ఇంటి వరకు సాగనంపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ సంధ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, మల్లేశం, సంపత్, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Honoring the retired officer