TRINETHRAM NEWS

చాపకింద నీరులాగా హెచ్‌ఎంపీవీ వైరస్(HMPV Virus) దేశంలో మెల్లగా వ్యాపిస్తోంది.

త్రినేత్రం న్యూస్ ఒకేరోజు ఏకంగా నాలుగు కేసులు నమోదు కావడం దేశ వ్యాప్తంగా కలకలంరేపుతోంది.కర్ణాటక(Karnataka)లో రెండు కేసులు గుజరాత్‌, కోల్‌కతాలో ఒక్కో కేసు నమోదైనట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ నిర్ధరణ కాగా. అహ్మదాబాద్‌లో ఇదే వైరస్ లక్షణాలతో ఓ చిన్నారి చికిత్స పొందుతోంది. హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ లక్షణాలు (HMPV virus Symptoms) కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి.
వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. ఇదిలా ఉండగా.. వైరస్ కేసులు నమోదుకావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎవరికి వారు జాగ్రత్తగాఉండాలని సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లోతప్పకుండా మాస్క్(Mask) ధరించాలనిఆదేశాలు జారీ చేసింది. వైరల్ లక్షణాలు కనిపిస్తేతప్పకుండా వైద్యులను సంప్రదించిటెస్టులు చేయించాలని సూచించింది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App